మురికి కాలువలో.. మృత దేహం.. 

ఉదయం పది గంటల వరకు పడుకోవడానికి అది పట్నం కాదు. ఒక మాములు జిల్లా కేంద్రం. ఎప్పుడు జనాలతో రద్దీగా ఉండే కోర్టు బస్టాండ్ ప్రాంతం. అలాగని అర్ధరాతి కాదు. ఉదయం 4:30 గంటలు. ఒంటరిగా ఉన్న ఒక మహిళా దగ్గరికి ముందుగా వ్యక్తి వచ్చాడు. ఆ తర్వాత మరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఇక అంటే ఆ ఏం జరిగిందో.. తెలియదు గానీ ఆ మరుసటి రోజు ఆ మహిళా డెడ్ బాడీగా ప్రత్యక్షం అయింది.   
     
ఆమె వయసు 30 లేదా 40 ఉంటుంది. పెళ్లి అయింది. ఏంజరిగిందో లేదో తెలియదు గానీ. కరీంనగర్ పట్టణంలోని కోర్టు బస్టాప్ పక్కన ఓ మురికి కాలువలో ఆమె మృతదేహమై కనిపించింది. రద్దీగా ఉండే ప్రదేశంలోనే ఏకంగా బస్టాప్ పక్కనే ఆమె మృతదేహాన్ని పడేయడం తీవ్ర కలకలం రేపింది. ఎక్కడైనా మర్డర్ చేసి ఆమె శవాన్ని అక్కడ పడేశారా? లేక అక్కడే ఆమెను మర్డర్ చేశారా ? అన్న  విషయం పై పోలీసులు ఆరా తీస్తున్నారు. మంగళవారం ఉదయం ఆమె మృతదేహాన్ని గుర్తించగా, రాత్రి అయినప్పటికీ నిందితులు ఎవరో ఎందుకు మర్డర్ చేశారో తెలియలేదు. దీంతో ఘటనలో కీలక ఆధారమైన సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. 
 
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా వద్ద మంగళవారం ఓ మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యం అయ్యింది. కరీంనగర్ లోని కోర్టు చౌరస్తా వద్ద జగిత్యాల వెళ్లే బస్టాప్ పక్కనే ఓ మురికి కాలవ ఉంది. ఓ ఆటో డ్రైవర్ ఆమె మృతదేహాన్ని చూసి స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

కాగా, అక్కడికి వచ్చి ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు , పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకే మృతదేహాన్ని కాలువ లోపలి వైపునకు తోసిసినట్టు పోలీసులు గుర్తించారు. దగ్గరగా వెళ్లి చూస్తే తప్ప మురికి కాలువలో మృతదేహం ఉన్నట్టు ఎవరికి తెలియదు. ఆమె మృతదేహం పక్కన పడి ఉన్న మద్యం సీసాతోపాటు, చెప్పులను స్వాధీనం చేసుకున్నారు. ఆ మురుగు కాలవలోకి ఒకరు దూరడమే కష్టం. అలాంటిది ఆమె మృతదేహాన్ని అందులో ఎలా పడేశారు? మృత దేహం దగ్గర ఉన్న సీసాలు, చెప్పులు ఉండడం వల్ల పలు సందేహాలు పోలీసులను వెంటాడుతున్నాయి. 

ఆమె ఛామనచాయ రంగు, గులాబీ కుర్తా, పైజమా, నీల రంగు ప్యాంటు ధరిచి ఉందనీ, సిలువ బొమ్మతో పుస్తెల తాడు కూడా ఉందనీ, ఎడమ చేయిపై టాటూ కూడా ఉందని ఆమె ఆనవాళ్లను పోలీసులు తెలిపారు. అయితే ఆమె ఒంటిపై మాత్రం ఎలాంటి గాయలు లేవని పోలీసులు తెలిపారు.  
ఆ ప్రాంతం లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా, తెల్లవారుజామున 4.30 గంటల సమయం నుంచి 5.15 గంటల సమయంలో ఆమె అదే ప్రాంతంలో తిరిగినట్టు కనిపించింది. ఆమె వద్దకు ముగ్గురు వ్యక్తులు వచ్చినట్లు సీసీ కెమెరా లో రికార్డ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురే ఆ మహిళను ఉదయం 5.15 గంటల తర్వాత హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

నిజంగా చెప్పాలంటే కరోనా వాళ్ళ చనిపోయిన వారికంటే.. ఒక మనిషిని మరో మనిషిని చంపినా మరణల రేట్ ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే రోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక కారణం చేత తండ్రిని చంపినా కొడుకు, కూతుర్ని చంపిన తండ్రి, వదినను చంపినా మరిది, భార్యను చంపిన భర్త, భర్తను చంపిన భార్య అంటూ వార్తలు విటునే ఉంటాం లాంటి వార్తల తోనే మన రోజు తెల్లారుతుంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu